Share News

డ్రోన్‌తో విద్యుత్‌ లైన్‌ల ఏర్పాటు

ABN , Publish Date - May 17 , 2026 | 05:14 AM

అనంతపురం జిల్లాలో విద్యుత్‌ శాఖ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

డ్రోన్‌తో విద్యుత్‌ లైన్‌ల ఏర్పాటు

ఇంటర్నెట్ డెస్క్: అనంతపురం జిల్లాలో విద్యుత్‌ శాఖ అధికారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. విద్యుత్‌ టవర్లు, స్తంభాలకు వైర్‌లను లాగేందుకు డ్రోన్‌ను వినియోగిస్తున్నారు. అనంతపురం రూరల్‌ మండలంలోని తాటిచెర్ల నుంచి కూడేరు వరకూ 33 కేవీ విద్యుత్‌ లైన్‌ ఏర్పాటు చేస్తున్నారు. కూడేరు విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ వద్దకు 33 కేవీ వైర్లు లాగేందుకు లైన్‌ క్రాసింగ్‌ సమస్యగా మారింది. దీంతో విద్యుత్‌ స్తంభాలకు బదులుగా, టవర్లను ఏర్పాటు చేశారు. డ్రోన్‌ను ఉపయోగించి వీటిపైకి వైరును లాగారు. ఈ టెక్నాలజీని అనంతపురం జిల్లాలో ప్రయోగాత్మకంగా వినియోగించామని ఏపీఎస్పీడీసీఎల్‌ ఎస్‌ఈ శేషాద్రి శేఖర్‌ అన్నారు. డ్రోన్‌ల ద్వారా విద్యుత్‌ వైర్లను లాగడం జిల్లాలో ఇదే మొదటిసారని ఎస్‌ఈ తెలిపారు.

- కూడేరు, ఆంధ్రజ్యోతి

Updated Date - May 17 , 2026 | 05:16 AM