Share News

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా రాష్ట్రం: సీఎం

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:02 AM

మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2025-26లో లక్ష్యాన్ని అధిగమించి...

గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా రాష్ట్రం: సీఎం

అమరావతి, ఏప్రిల్‌ 3(ఆంధ్రజ్యోతి): మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు అమలులో రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలవడం పట్ల సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. 2025-26లో లక్ష్యాన్ని అధిగమించి, రికార్డు స్థాయిలో 1,26,057 హెక్టార్లను సూక్ష్మసేద్యం పరిధిలోకి తీసుకొచ్చిన అధికారులు, సిబ్బందిని సీఎం శుక్రవారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ పథకాన్ని వినియోగించుకుంటున్న 1,08,143 మంది రైతులకు శుభాభినందనలు తెలిపారు. మైక్రో ఇరిగేషన్‌ను మరింత సమర్థవంతంగా ముందుకు తీసుకెళ్లాలని అధికారులకు నిర్దేశించారు.

Updated Date - Apr 04 , 2026 | 05:04 AM