Share News

అస్తవ్యస్తంగా పొగాకు కొనుగోళ్లు

ABN , Publish Date - May 03 , 2026 | 06:02 AM

రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. వేలం కేంద్రాలకు రైతులు తీసుకెళ్లిన పొగాకును కొన్ని కంపెనీలు కొనుగోలు చేయకపోగా, గతంలో మాదిరిగా గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఉత్పత్తి పెరుగుదల, సిగరెట్‌ ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు, యుద్ధ ప్రభావంతో...

అస్తవ్యస్తంగా పొగాకు కొనుగోళ్లు

  • గిట్టుబాటు ధర రాక.. నష్టపోతున్న రైతులు

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పొగాకు కొనుగోళ్లు అస్తవ్యస్తంగా మారాయి. వేలం కేంద్రాలకు రైతులు తీసుకెళ్లిన పొగాకును కొన్ని కంపెనీలు కొనుగోలు చేయకపోగా, గతంలో మాదిరిగా గిట్టుబాటు ధర ఇవ్వట్లేదు. ఉత్పత్తి పెరుగుదల, సిగరెట్‌ ఉత్పత్తులపై జీఎస్టీ పెంపు, యుద్ధ ప్రభావంతో మార్కెట్‌ ఒడిదుడుకులు ఎదుర్కొంటోంది. కొన్ని వేలం కేంద్రాల్లో రోజు విడిచి రోజే విక్రయాలు జరుగుతున్నా.. రైతులు తీసుకెళ్లిన బేళ్ల ను పొగాకు బోర్డుకు పరిమితంగానే అనుమతిస్తున్నారు. కొన్ని కంపెనీలు తక్కువ ధరకు అడుగుతున్నాయి. గతేడాది కిలో పొగాకు రూ.280తో ప్రారంభమై, 3 నెలల్లో రూ.450కి చేరింది. ఈ ఏడాది రూ.260తో ప్రారంభమైనా.. ప్రస్తుతం సగటు ధర రూ.240 మాత్రమే పలుకుతోంది. గిట్టుబాటు కాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో చాలావరకు బేళ్లను కోల్డ్‌స్టోరేజీల్లో పెట్టుకుంటున్నారు. గత మూడేళ్లు ధరలు ఆశాజనకంగా ఉండటంతో సం ప్రదాయంగా వర్జీనియా పొగాకు పండించే రైతు లు ఉత్పత్తిని పెంచుతున్నారు. 2024-25లో నల్లబర్లీ పొగాకు పండించిన రైతులు ధర రాక, కొనుగోళ్లు లేక ఇబ్బందిపడినందున 2025లో ఆ రకం పొగాకును ప్రభుత్వం నిషేధించింది. అయితే వర్జీనియా పొగాకుకు ధర రాక రైతులు నష్టపోతున్నా రు. ఇటీవల కొండపి, టంగుటూరు వేలం కేంద్రాల ను సందర్శించిన రైతు సంఘాలు నాయకులు.. కిలో పొగాకు రూ.300పైన ఉండేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

Updated Date - May 03 , 2026 | 06:02 AM