ఏపీలో కొత్తగా జాతీయ శిక్షణ నైపుణ్య సంస్థ
ABN , Publish Date - Mar 10 , 2026 | 04:15 AM
ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధికి ఊతమిచ్చేలా త్వరలోనే కొత్తగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌ఎ్‌సటీఐ) ఏర్పాటు కానుంది.
న్యూఢిల్లీ, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌లో నైపుణ్యాభివృద్ధికి ఊతమిచ్చేలా త్వరలోనే కొత్తగా నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్(ఎన్‌ఎస్‌టీఐ) ఏర్పాటు కానుంది. దాదాపు రూ.100 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని నిర్మించనున్నట్లు కేంద్ర నైపుణ్యాభివృద్ధి సహాయ మంత్రి జయంత్ చౌదరి తెలిపారు. సోమవారం లోక్‌సభలో చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు. స్థల సేకరణ, చట్టపరమైన అనుమతులు లభించిన నాటి నుంచి మూడేళ్ల వ్యవధిలో ఈ సంస్థను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.