త్వరలో ఎంఎస్ఎంఈ కేంద్రాలు
ABN , Publish Date - Apr 17 , 2026 | 04:29 AM
రాష్ట్రంలో త్వరలో ఎంఎస్ఎంఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తెలిపారు.
జగన్ తనను మించిన హాస్య నటుడు అని బ్రహ్మానందం భావిస్తున్నారు: మంత్రి టీజీ భరత్
రాయదుర్గం, ఏప్రిల్ 16(ఆంధ్ర జ్యోతి): రాష్ట్రంలో త్వరలో ఎంఎస్ఎంఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తామని పరిశ్రమల మంత్రి టీజీ భరత్ తెలిపారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో వీటిని ఏర్పాటు చేసి చిన్న, మధ్య తరహా పరిశ్రమలను మరింతగా ప్రోత్సహిస్తామని అన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గంలో జరుగుతున్న ‘ప్రగతి పండుగ’లో గురువారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడారు.‘జగన్ బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చి మావిగన్ పేరుతో ప్రెస్‌మీట్ పెట్టి, కామెడీ యాక్టర్‌గా తయారయ్యారు. జగన్ తీరును చూసి తనను మించిన హాస్యనటుడు రాష్ట్రంలో ఉన్నాడని బ్రహ్మానందం భావిస్తున్నట్లు నా దృష్టికి వచ్చింది’ అని మంత్రి వ్యాఖ్యానించారు.