ఎలక్ర్టానిక్ డ్రైయర్ల ఏర్పాటుకు చర్యలు: అచ్చెన్న
ABN , Publish Date - Feb 26 , 2026 | 04:27 AM
రాష్ట్రంలో పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవటానికి ఎలక్ర్టానిక్ డ్రైయర్లు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు.
ఇంటర్నెట్ డెస్క్: రాష్ట్రంలో పంట ఉత్పత్తులను ఆరబెట్టుకోవటానికి ఎలక్ర్టానిక్ డ్రైయర్లు ఏర్పాటు చేసే అంశం పరిశీలనలో ఉందని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు చెప్పారు. ధాన్యం కళ్లాల ఏర్పాటుపై టీడీపీ సభ్యుల ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ ‘అకాల వర్షాలకు పంట ఉత్పత్తులు తడవకుండా రైతుసేవా కేంద్రాల ద్వారా టార్పాలిన్లు పంపిణీ చేస్తున్నాం. ఎలక్ర్టానిక్ డ్రైయర్లు, ఆధునిక యార్డుల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. 572 పీఏసీఎ్‌సల్లో 1,111 సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేశాం’ అని చెప్పారు.