62.65 లక్షల మంది పిల్లలకు ఆరోగ్య పరీక్షలు
ABN , Publish Date - Jul 19 , 2026 | 03:20 AM
రాష్ట్రవ్యాప్తంగా 62.65 లక్షల మంది పిల్లలకు 38 రకాల సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు.
ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ వెల్లడి
అమరావతి, జూలై 18(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 62.65 లక్షల మంది పిల్లలకు 38 రకాల సమగ్ర ఆరోగ్య పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. చిన్న వయసులోనే మధుమేహం, అధిక రక్తపోటు వంటి జీవనశైలి వ్యాధులకు గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా ప్రత్యేక స్ర్కీనింగ్‌కు శ్రీకారం చుట్టిందని శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ్య కార్యక్రమం (ఆర్‌బీఎ్‌సకే 2.0)లో భాగంగా ఉచితంగా ఈ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. 2026-27లో అంగన్‌వాడీ కేంద్రాల్లోని 20.95 లక్షల మంది, ప్రభుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదువుతున్న 41.70 లక్షల మంది విద్యార్థులకు అక్కడే వైద్య బృందాలు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తాయని తెలిపారు.