Share News

వీబీజీరామ్‌జీ అమలుకు గ్రామీణాభివృద్ధి శాఖ సన్నద్ధం

ABN , Publish Date - Jun 22 , 2026 | 05:19 AM

ఉపాధి హామీ పథకాన్ని జూలై 1 నుంచి వీబీజీరామ్‌జీ పథకంగా మార్చనున్న నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖలో తీసుకురావల్సిన సంస్కరణలపై సూచనలిచ్చేందుకు..

వీబీజీరామ్‌జీ అమలుకు గ్రామీణాభివృద్ధి శాఖ సన్నద్ధం

అమరావతి, జూన్‌ 21(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామీ పథకాన్ని జూలై 1 నుంచి వీబీజీరామ్‌జీ పథకంగా మార్చనున్న నేపథ్యంలో గ్రామీణాభివృద్ధి శాఖలో తీసుకురావల్సిన సంస్కరణలపై సూచనలిచ్చేందుకు సాధికార కమిటీని ఏర్పాటు చేస్తూ.. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజ ఆదివారం ఉత్తర్వులు ఇచ్చారు. ఈ కమిటీకి చైర్మన్‌గా సొసైటీ ఫర్‌ రూరల్‌ డెవల్‌పమెంట్‌ సర్వీసెస్‌ మెంబర్‌ సెక్రటరీ కన్నమనాయుడు వ్యవహరిస్తారు. ఈ పథకం అమలు కోసం తీసుకురావల్సిన సంస్కరణలపై ఉద్యోగ సంఘాలతో చర్చించి ఈ కమిటీ సూచనలు చేస్తుంది.

Updated Date - Jun 22 , 2026 | 05:20 AM