Share News

ఏపీలో డబ్ల్యూఈఎఫ్‌ కేంద్రం

ABN , Publish Date - Jan 24 , 2026 | 06:44 AM

నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) నిర్ణయించింది.

ఏపీలో డబ్ల్యూఈఎఫ్‌ కేంద్రం

దావోస్‌, జనవరి 23: నాల్గవ పారిశ్రామిక విప్లవం కోసం ప్రపంచవ్యాప్తంగా ఐదు కొత్త కేంద్రాలను ఏర్పాటు చేయాలని వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరం (డబ్ల్యూఈఎఫ్‌) నిర్ణయించింది. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో ఒక కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. దావోస్‌ ప్రపంచ ఆర్థిక సదస్సులో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. భారత్‌లోని ముంబై, తెలంగాణల్లో ఇప్పటికే రెండు డబ్ల్యూఈఎఫ్‌ కేంద్రాలు ఉన్నాయి. ఏపీలోనూ ఏర్పాటయ్యే సెంటర్‌తో వీటి సంఖ్య మూడుకు పెరగనుంది. ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఫ్రాన్స్‌, బ్రిటన్‌, యూఏఈల్లో ఈ కొత్త కేంద్రాలు ఏర్పాటుకానున్నాయి. ఈ కేంద్రాలు ప్రభుత్వాలు, ప్రైవేటు పరిశ్రమలతో కలిసి ఏఐ, సైబర్‌ సెక్యూరిటీ, ఎనర్జీ వంటి రంగాల్లో సవాళ్లను పరిష్కరిస్తాయని, సాంకేతికత ప్రయోజనాలను సమాజానికి అందేలా పనిచేస్తాయని డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు, సీఈవో బోర్జ్‌ బ్రెండే తెలిపారు. డబ్ల్యూఈఎ్‌ఫతో ఈ భాగస్వామ్యం.. అవసరమైన చోట సామర్థ్యాన్ని పెంపొందించడంలో తమ నిబద్ధతను తెలియజేస్తుందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు.

Updated Date - Jan 24 , 2026 | 06:44 AM