నియోజకవర్గానికో మోడల్ సోలార్ విలేజ్
ABN , Publish Date - Apr 01 , 2026 | 05:09 AM
విద్యుత్ భారాలను, నష్టాలను తగ్గించుకోవడానికి సోలార్ వంటి పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా నియోజకవర్గానికో...
సంతృప్తస్థాయి 90 శాతానికి పెరగాలి: మంత్రి గొట్టిపాటి
అమరావతి, మార్చి 31 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ భారాలను, నష్టాలను తగ్గించుకోవడానికి సోలార్ వంటి పునరుత్పాదక ఇంధనాల వినియోగం పెంచుకోవాల్సిన అవసరం ఉందని, అందులో భాగంగా నియోజకవర్గానికో మోడల్ సోలార్ విలేజ్‌ను అభివృద్ధి చేయాలని విద్యుత్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. మంగళవారం సీపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్, నెడ్‌క్యాప్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ‘‘పీఎం సూర్యఘర్ కింద ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా సోలార్ కనెక్షన్లు అందిస్తున్నాం. అధికారులు సమన్వయంతో పనిచేసి ఎస్సీ, ఎస్టీలకు మంజూరు చేసిన 6 లక్షల కనెక్షన్లను వచ్చే 4 నెలల్లో పూర్తి చేయాలి. వేసవి ముగిసే నాటికి ప్రతి నియోజకవర్గంలోనూ కనీసం 6వేల సూర్యఘర్ కనెక్షన్లు లక్ష్యంగా పెట్టుకోవాలి. సీపీడీసీఎల్ పరిధిలో 11 వేల వ్యవసాయ కనెక్షన్లు పెండింగ్‌లో ఉన్నాయి. సీజన్ ప్రారంభమయ్యే నాటికి వాటిని మంజూరు చేయాలి’ అని మంత్రి సూచించారు.