Share News

జిల్లా కోర్టుల వద్ద అంబులెన్స్‌లు

ABN , Publish Date - Jun 30 , 2026 | 06:32 AM

రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కోర్టు ల వద్ద అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ కలిగిన ‘108’ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

జిల్లా కోర్టుల వద్ద అంబులెన్స్‌లు

అమరావతి, జూన్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా 13 జిల్లాల్లో కోర్టు ల వద్ద అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్ట్‌ కలిగిన ‘108’ అంబులెన్స్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి ఎస్‌. సురేశ్‌కుమార్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కోర్టు వద్ద ఒక అంబులెన్స్‌ ఏర్పాటు చేయాలని హైకోర్టు రిజిస్ట్రార్‌ ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్ట్‌ సీఈవో పంపిన ప్రతిపాదనలకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 13 జిల్లా కోర్టుల వద్ద అందుబాటులో ఉంచనున్న అంబులెన్సులకు ఏటా రూ.3.93 కోట్లు చెల్లించేందుకు ప్రభుత్వం సిద్ధ మైంది. అలానే సీఆర్‌డీఏ పరిధిలోని రాయపూడి, ఐనవోలు, ఉండవల్లి వద్ద 3 కొత్త 108 అంబులెన్సులు అందుబాటులో ఉంచేందుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.

Updated Date - Jun 30 , 2026 | 06:33 AM