భవిష్యత్తు టెక్నాలజీ కోసం ఏపీలో బలమైన ఎకో సిస్టమ్
ABN , Publish Date - May 12 , 2026 | 04:48 AM
జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి సాధ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తు టెక్నాలజీల కోసం ఏపీలో బలమైన ఎకో సిస్టమ్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు.
జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా ఎక్స్‌లో సీఎం
అమరావతి, మే 11(ఆంధ్రజ్యోతి): జ్ఞానం, పరిశోధన, ఆవిష్కరణలతోనే దేశ ప్రగతి సాధ్యమని సీఎం చంద్రబాబు తెలిపారు. భవిష్యత్తు టెక్నాలజీల కోసం ఏపీలో బలమైన ఎకో సిస్టమ్ నిర్మాణమే లక్ష్యంగా పనిచేస్తున్నామన్నారు. జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా శాస్త్రవేత్తలు, ఇన్నోవేటర్లు, యువతకు సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈమేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘రాష్ట్రాన్ని క్వాంటం టెక్నాలజీ, ఏఐ, డేటా అనలిటిక్స్, సైబర్ సెక్యూరిటీల్లో అగ్రగామిగా నిలపాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతున్నాం. 2026-27లో ఈ విభాగాల్లో 2 లక్షల మందికి శిక్షణ ఇవ్వనున్నాం. ఐదేళ్ల కాలంలో 10 లక్షల మంది సుశిక్షతులను తయారు చేస్తాం. ఎన్‌పీటీఎల్ జాతీయ పరీక్షలో ఏపీ విద్యార్థులు 4 గోల్డ్, 14 సిల్వర్ మెడల్స్ సాధించి సత్తా చాటారు. అలాంటి ప్రతిభావంతులకు రాష్ట్రాన్ని చిరునామాగా చేస్తాం’ అని అన్నారు.