Share News

లండన్‌ మ్యూజియం నుంచి అమరావతి శిల్పాలు రప్పిస్తున్నాం

ABN , Publish Date - Feb 06 , 2026 | 02:57 AM

లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియంలో భద్రపరిచిన అమరావతి సున్నపురాయి శిల్పాలను ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది.

లండన్‌ మ్యూజియం నుంచి అమరావతి శిల్పాలు రప్పిస్తున్నాం

  • కేంద్రానికి లేఖ రాసిన సాంస్కృతిక శాఖ

గుంటూరు సిటీ, ఫిబ్రవరి 5(ఆంధ్రజ్యోతి): లండన్‌లోని బ్రిటిష్‌ మ్యూజియంలో భద్రపరిచిన అమరావతి సున్నపురాయి శిల్పాలను ఆంధ్రప్రదేశ్‌కు తిరిగి తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు వేగవంతం చేసింది. ఈ మేరకు యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్‌ జైన్‌.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. మొదటి దశలో ఈ శిల్పాలను అప్పుగా (లోన్‌ పద్థతిలో) భారత్‌కు తీసుకురావడంపై బ్రిటిష్‌ మ్యూజియంతో చర్చలు జరపాలని లేఖలో సూచించారు. ప్రస్తుతం బ్రిటిష్‌ మ్యూజియంలో సుమారు 133 అమరావతి శిల్పాలు ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాష్ట్రంలో ప్రతిపాదిత మ్యూజియం నిర్మాణం పూర్తయ్యాక ఈ శిల్పాలను అమరావతిలో ప్రదర్శించనున్నట్లు ప్రభుత్వం తెలిపింది.

Updated Date - Feb 06 , 2026 | 02:57 AM