Share News

యూరియా కార్డులతో కౌలు రైతుకు అన్యాయం

ABN , Publish Date - May 20 , 2026 | 05:53 AM

కౌలు రైతులకు అన్యాయం చేయడానికే ప్రభుత్వం యూరియా కార్డుల ప్రతిపాదనను తెర మీదకు తీసుకొస్తోందని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం అభిప్రాయపడింది.

యూరియా కార్డులతో కౌలు రైతుకు అన్యాయం

  • ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం

విజయవాడ సిటీ, మే 19 (ఆంధ్రజ్యోతి): కౌలు రైతులకు అన్యాయం చేయడానికే ప్రభుత్వం యూరియా కార్డుల ప్రతిపాదనను తెర మీదకు తీసుకొస్తోందని ఆంధ్రప్రదేశ్‌ కౌలు రైతుల సంఘం అభిప్రాయపడింది. వ్యవసాయ శాఖ సమీక్షా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి ఈ క్రాప్‌ పట్టాదారు పాస్‌ పుస్తకాల ఆధారంగా యూరియా కార్డులు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బి.బలరాం, ఎం.హరిబాబు ఓ ప్రకటనలో పేర్కొన్నారు. కౌలు రైతుల పేర్లతో ఈ క్రాప్‌ చేయడంలేదని, పట్టాదారు పాసు పుస్తకాలూ ఉండవని, ఏ రకంగా కౌలు రైతును గుర్తించి యూరియా కార్డులు ఇస్తారో మంత్రి వివరించకపోవడం శోచనీయమన్నారు. అమల్లో ఉన్న చట్టాల ద్వారా కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వలేని ప్రభుత్వం, యూరియా కార్డుల ద్వారా అవసరమైన ఎరువులు అందిస్తామనడం విడ్డూరంగా ఉందని తెలిపారు. కేంద్రం నుంచి గతంలో మాదిరిగా రాష్ట్ర కోటాకు సంబంధించి మొత్తం యూరి యా, ఎరువులు తీసుకొస్తారా...లేదా యూరియా కోటా తగ్గించుకోవడం ద్వారా డబ్బులు తీసుకొస్తారా అనే విషయాన్ని ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు.

Updated Date - May 20 , 2026 | 05:53 AM