Share News

25 నుంచి బదిలీలు, పదోన్నతులు తాత్కాలిక బంద్‌

ABN , Publish Date - Jun 20 , 2026 | 05:36 AM

గతేడాది డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ కోసం పదోన్నతులు, బదిలీలు, కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్‌గ్రేడేషన్‌, పోస్టుల మార్పును..

25 నుంచి బదిలీలు, పదోన్నతులు తాత్కాలిక బంద్‌

అమరావతి, జూన్‌ 19 (ఆంధ్రజ్యోతి): గతేడాది డిసెంబరు 15 నుంచి అమల్లోకి వచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల ప్రకారం స్థానిక కేడర్ల పునర్‌వ్యవస్థీకరణ ప్రక్రియ కోసం పదోన్నతులు, బదిలీలు, కొత్త పోస్టుల సృష్టి, పోస్టుల అప్‌గ్రేడేషన్‌, పోస్టుల మార్పును ఈ నెల 25 నుంచి తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు సాధారణ పరిపాలన శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ఈలోగా ఇప్పటికే ఆర్థిక శాఖ అనుమతి పొందిన కొత్త పోస్టుల సృష్టి, మార్పులకు సంబంధించిన ఉత్తర్వులు జారీచేయాలని ప్రభుత్వం వివిధ శాఖలను ఆదేశించింది. సెలెక్షన్‌ పోస్టులకు సంబంధించి డీపీసీ ప్రక్రియ పూర్తి చేయడం, ఇప్పటికే ఆమోదం పొంది, ఖాళీగా ఉన్న పోస్టులకు పదోన్నతుల ఆదేశాలివ్వడం, నిబంధనల ప్రకారం అవసరమైన బదిలీలు, డిప్యుటేషన్‌ ఉత్తర్వులు ఇవ్వాలని పేర్కొన్నారు.

Updated Date - Jun 20 , 2026 | 05:37 AM