25న టీచర్ల సీనియారిటీ జాబితాలు
ABN , Publish Date - Feb 17 , 2026 | 04:40 AM
ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాల విడుదలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు.
అమరావతి, ఫిబ్రవరి 16(ఆంధ్రజ్యోతి): ఉపాధ్యాయుల సీనియారిటీ జాబితాల విడుదలకు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ వి.విజయరామరాజు ఆదేశాలు జారీచేశారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన జాబితాలు సిద్ధం చేయాలన్నారు. మొదటి విడత జాబితాలను ఈనెల 25న విడుదల చేస్తారు. వాటిపై అభ్యంతరాలు స్వీకరించి, పరిష్కరించిన తర్వాత మార్చి 3న రెండో విడత జాబితాలు విడుదల చేస్తారు. మార్చి 15న మూడో విడత జాబితాలు, మార్చి 30న తుది జాబితాలు విడుదల చేసి, సీనియారిటీ ఖరారు చేస్తారు. ఆ సీనియారిటీ ఆధారంగా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు జరుగుతాయి.