టైలర్ కుమారుడికి 1.06 కోట్ల ప్యాకేజీ
ABN , Publish Date - Jul 27 , 2026 | 04:30 AM
తండ్రి టైలర్.. తల్లి కుట్టు పనిలో భర్తకు సాయంగా ఉంటుంది. ఇలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడా కంపెనీలో ఏఐ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు.
కెనడా కంపెనీలో ఏఐ ఇంజనీర్‌గా ఉద్యోగం
కాకినాడ జిల్లా కొత్తపల్లి యువకుడి ఘనత
కొత్తపల్లి, జూలై 26 (ఆంరఽధజ్యోతి): తండ్రి టైలర్.. తల్లి కుట్టు పనిలో భర్తకు సాయంగా ఉంటుంది. ఇలాంటి పేద కుటుంబం నుంచి వచ్చిన విద్యార్థి రూ.1.06 కోట్ల వార్షిక వేతనంతో కెనడా కంపెనీలో ఏఐ ఇంజనీర్‌గా ఉద్యోగం సాధించాడు. కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం కొత్తపల్లి మండలం కుతుకుడుమిల్లి గ్రామానికి చెందిన మాల్తి అఖిలేశ్... ఇటీవల నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అయి ఆఫర్ లెటర్ అందుకున్నారు. ఇటీవలే విధుల్లో చేరిన అఖిలేశ్... ఇది పూర్తిగా వర్క్‌ఫ్రం హోం ఉద్యోగమని ‘ఆంధ్రజ్యోతి’కి తెలిపారు. మాల్తి అఖిలేశ్ తండ్రి గంగాధరరావు చెవిటి, మూగ. ఆయన టైలరింగ్ చేస్తూ వచ్చే కొద్దిపాటి ఆదాయంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు పిల్లల్ని చదివించారు. అఖిలేశ్ తల్లి భర్త కుట్టిన వస్త్రాలకు చేతిపనులు చేస్తూ ఆసరాగా ఉంటోంది. కొత్తపల్లి వీవీఎ్‌సలో పదో తరగతి వరకు చదివిన అఖిలేశ్.. నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ (ఎంపీసీ), సూరంపాలెం ఆదిత్య యూనివర్సిటీలో డేటాసైన్స్‌లో ఇంజనీరింగ్ పూర్తిచేశాడు.