Share News

క్వాంటమ్‌ కోర్సులో 2,839 మంది ఉత్తీర్ణత

ABN , Publish Date - Apr 17 , 2026 | 04:54 AM

నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) నిర్వహించిన క్వాంటమ్‌ కోర్సులో రాష్ట్ర విద్యార్థులు 2,839 మంది ఉత్తీర్ణత సాధించారు.

క్వాంటమ్‌ కోర్సులో 2,839 మంది ఉత్తీర్ణత

  • పలువురు విద్యార్థులకు స్వర్ణ, రజత పతకాలు

  • ఇది చరిత్రాత్మకం: ఉన్నత విద్యామండలి చైర్మన్‌

అమరావతి, ఏప్రిల్‌ 16(ఆంధ్రజ్యోతి): నేషనల్‌ ప్రోగ్రామ్‌ ఆన్‌ టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌ (ఎన్‌పీటీఈఎల్‌) నిర్వహించిన క్వాంటమ్‌ కోర్సులో రాష్ట్ర విద్యార్థులు 2,839 మంది ఉత్తీర్ణత సాధించారు. క్వాం టమ్‌ టెక్నాలజీపై ఎన్‌పీటీఈఎల్‌ ‘ఇంట్రడక్షన్‌ టు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌: క్వాంటమ్‌ ఆల్గరిథమ్స్‌ అండ్‌ కీస్కిట్‌’ అనే కోర్సును నిర్వహించింది. రాష్ట్రం నుంచి లక్ష మంది విద్యార్థులు ఈ కోర్సుకు రిజిస్ర్టేషన్‌ చేసుకోగా 20 వేల మంది పరీక్ష రాసేందుకు ఫీజు చెల్లించి, 19 వేల మంది హాజరయ్యారు. ఉత్తీర్ణత సాధించిన విద్యార్థుల్లో పలువురికి గోల్డ్‌, సిల్వర్‌ మెడల్స్‌ వచ్చాయని ఉన్నత విద్యామండలి తెలిపింది. దీనిపై ఉన్న విద్యా మండలి చైర్మన్‌ కె.మధుమూర్తి గురువారం ఓ ప్రకటన విడుదల చేశారు. క్వాంటమ్‌ టెక్నాలజీలో రాష్ట్ర విద్యా ర్థులు ఇంత మంది ఉత్తీర్ణులు కావడం చరిత్రాత్మకం అని ఆయన పేర్కొన్నారు. క్వాంటమ్‌ టెక్నాలజీలో దేశం, ప్రపంచానికి ఏపీ మార్గదర్శనం చేస్తుందన్నారు.

Updated Date - Apr 17 , 2026 | 04:55 AM