Share News

స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వండి

ABN , Publish Date - May 13 , 2026 | 05:17 AM

రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా సూచించారు.

స్థానిక ఎన్నికలకు సిద్ధమవ్వండి

  • ఓటర్ల జాబితాలను అప్‌డేట్‌ చేయండి: కమిషనర్‌ పునేఠా

అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆయా శాఖల అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ అనిల్‌చంద్ర పునేఠా సూచించారు. మంగళవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ (ఎస్‌ఈసీ) కార్యాలయంలో పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృది ్ధశాఖ, పురపాలక శాఖల ముఖ్య కార్యదర్శులు కాంతిలాల్‌ దండే, సురేశ్‌కుమార్‌, బీసీ సంక్షేమశాఖ ఎక్స్‌అఫిషియో కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ కృష్ణతేజతో ఆయన సమావేశమయ్యారు. ఓటర్ల జాబితాలు సిద్దమయ్యాయని, నోటిఫికేషన్‌కు ముందు వాటిని అప్‌డేట్‌ చేసుకోవాలని పునేఠా సూచించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం కార్యదర్శి మల్లికార్జున పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా ఓటర్ల జాబితా గురించి వివరించారు. కాకినాడ, శ్రీకాకుళం మున్సిపల్‌ కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియ గురించీ చర్చలు జరిగాయి. బీసీ డెడికేటెడ్‌ కమిషన్‌ అధ్యయనంపైనా చర్చించారు.

Updated Date - May 13 , 2026 | 05:17 AM