Share News

టెన్త్‌ ఫలితాల విడుదలపై తప్పుడు ప్రచారం

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:35 AM

పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం విడుదల చేస్తారని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు.

టెన్త్‌ ఫలితాల విడుదలపై తప్పుడు ప్రచారం

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల ఫలితాలు శనివారం విడుదల చేస్తారని సోషల్‌ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఫలితాల విడుదల తేదీపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. విడుదల తేదీని త్వరలో అధికారికంగా ప్రకటిస్తామన్నారు. అనధికారిక సమాచారం నమ్మొద్దని తల్లిదండ్రులు, విద్యార్థులకు సూచించారు. తప్పుడు ప్రచారం చేసేవారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Updated Date - Apr 25 , 2026 | 05:36 AM