విద్యారంగంలో వన్ నేషన్-వన్ సబ్‌స్ర్కిప్షన్!
ABN , Publish Date - Feb 19 , 2026 | 04:11 AM
విద్యా రంగంలో వన్ నేషన్-వన్ సబ్‌స్ర్కిప్షన్(ఓఎన్‌ఓఎస్) అమలుకు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది.
అమరావతి, ఫిబ్రవరి 18(ఆంధ్రజ్యోతి): విద్యా రంగంలో వన్ నేషన్-వన్ సబ్‌స్ర్కిప్షన్(ఓఎన్‌ఓఎస్) అమలుకు త్రైపాక్షిక ఒప్పందం కుదిరింది. గుజరాత్‌లోని గాంధీనగర్‌కు చెందిన ఇన్‌ఫ్లిబినెట్ సెంటర్, రాష్ట్ర ఉన్నత విద్యామండలి, రాష్ర్టానికి చెందిన 20 యూనివర్సిటీల రిజిస్ర్టార్ల మధ్య ఈ అవగాహన ఒప్పందం జరిగింది. నాగార్జున యూనివర్సిటీలో బుధవారం ఉన్నత విద్యామండలి ఆధ్వర్యంలో ఓఎన్‌ఓఎస్‌పై వర్క్‌షాప్ నిర్వహించారు. ఇన్‌ఫ్లిబినెట్ ప్రతినిధులు, యూనివర్సిటీల రిజిస్ర్టార్లు, లైబ్రేరియన్లు పాల్గొన్నారు. ఉన్నత విద్యలో నాణ్యమైన ఈ-రిసోర్స్‌లను పొందడం, పరిశోధనల బలోపేతానికి ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని ఉన్నత విద్యామండలి చైర్మన్ కె.మధుమూర్తి తెలిపారు.