ఉత్తమ టీచర్లకు అంతర్జాతీయ శిక్షణ
ABN , Publish Date - Jun 13 , 2026 | 04:58 AM
ఫిన్‌ల్యాండ్ పంపుతున్న 26 మం ది ఉత్తమ టీచర్లకు 3 దశల్లో అంతర్జాతీయస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు.
అమరావతి, జూన్ 12(ఆంధ్రజ్యోతి): ఫిన్‌ల్యాండ్ పంపుతున్న 26 మం ది ఉత్తమ టీచర్లకు 3 దశల్లో అంతర్జాతీయస్థాయి శిక్షణ ఇవ్వనున్నట్లు సమగ్రశిక్ష స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ బి.శ్రీనివాసరావు తెలిపారు. ఫిన్‌ల్యాండ్ వెళ్లేందుకు ఎంపిక చేసిన టీచర్లకు విజయవాడలో శుక్రవారం ఇంటర్నేషనల్ ప్రొఫెషనల్ డెవల్‌పమెంట్ ప్రోగ్రాంను ప్రారంభించారు. మొదటి దశలో విజయవాడలో తుర్కు విశ్వవిద్యాలయం సాంకేతిక నిపుణులతో శిక్షణ ఇప్పిస్తున్నారు. రెండో దశలో ఆగస్టు 17 నుంచి 26 వరకు టీచర్లు ఫిన్‌ల్యాండ్‌లోని తుర్కు, రౌమా నగరాల్లో పర్యటించి అక్కడి బోధనా, విద్యా విధానాలను పరిశీలిస్తారు. మూడో దశలో.. పాఠశాలల్లో అమలుచేసే ప్రాజెక్టుల కోసం ‘యూనివర్సిటీ ఆఫ్ తుర్కు’ ప్రొఫెసర్లు ఆన్‌లైన్‌లో పర్యవేక్షిస్తూ టీచర్లకు మార్గదర్శనం చేస్తారని ఎస్పీడీ వెల్లడించారు.