Share News

Nara Lokesh: పరిశ్రమల గ్రౌండింగ్‌పై రెండేళ్లలో పురోగతి

ABN , Publish Date - Jan 10 , 2026 | 04:38 AM

ఏపీలో గత ప్రభుత్వం పీపీఏలను రద్దు చేయడంతో చాలా కంపెనీలు భయపడి వెళ్లిపోయాయి, అభివృద్ధికి ప్ర భుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం.

Nara Lokesh: పరిశ్రమల గ్రౌండింగ్‌పై రెండేళ్లలో పురోగతి

  • ప్రభుత్వాల కొనసాగింపుతోనే రాష్ట్రాభివృద్ధి.. గత సర్కారు పీపీఏలను రద్దు చేసింది

  • ఆ భయంతో చాలా కంపెనీలు పరార్‌.. ఈ విషయంలో ప్రజల్లో చైతన్యం రావాలి

  • పాలనలో టెక్నాలజీ వినియోగంతో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం

  • ఫిబ్రవరిలో ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనులకు శ్రీకారం

  • మార్చిలో ఇండియా ఏఐ కాన్ఫరెన్స్‌కుఏపీ ఆతిథ్యం

  • గూగుల్‌ అనుభవంతో రాష్ట్రానికి భారీ ఎఫ్‌డీఐలు రప్పించేందుకు కృషి

ఒకసారి ఏదైనా పరిశ్రమ ఏపీతో ఎంవోయూ చేసుకున్నాక.. ఆ ప్రాజెక్టును మా సొంతదిగా భావించి.. అతి తక్కువ సమయంలో అన్ని రకాల అనుమతులూ ఇస్తున్నాం.

ఏపీలో క్వాంటమ్‌ ఎకో సిస్టమ్‌ చంద్రబాబు కల. ఐబీఎం, టీసీఎస్‌, ఎల్‌అండ్‌టీ, ఐఐటీ మద్రాస్‌ వంటి సంస్థలను ఏకతాటిపైకి తెచ్చి అమరావతి క్వాంటమ్‌ వ్యాలీకి ఆయన శ్రీకారం చుట్టారు.

- మంత్రి లోకేశ్‌

అమరావతి, జనవరి 9(ఆంధ్రజ్యోతి): ‘ఏపీలో గత ప్రభుత్వం పీపీఏలను రద్దు చేయడంతో చాలా కంపెనీలు భయపడి వెళ్లిపోయాయి, అభివృద్ధికి ప్ర భుత్వాల కొనసాగింపు చాలా ముఖ్యం. ప్రజలు ఈ విషయంలో చైతన్యవంతులు కావాలి’ అని రాష్ట్ర ఐ టీ, విద్యాశాఖల మంత్రి లోకేశ్‌ అన్నారు. శుక్రవారం మహారాష్ట్ర పుణేలోని ‘గోఖలే ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పాలిటిక్స్‌ అండ్‌ ఎకనామిక్స్‌’ సంస్థ నిర్వహించిన పబ్లిక్‌ పాలసీ ఫెస్టివల్‌లో ఆయన ప్రసంగించారు. ఏపీలో ఇప్పటికే పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చిన పరిశ్రమల గ్రౌండింగ్‌కు సంబంధించి రెండేళ్లలో పురోగతి చూపిస్తామన్నారు. ఆ తర్వాత వచ్చే పరిశ్రమలు గ్రౌండయ్యేసరికి మరో రెండేళ్లు పడతాయని తెలిపారు. 1995, 99ల్లో వరుసగా రెండుసార్లు చంద్రబాబు సీఎంగా బాధ్యతలు చేపట్టడం వల్ల హైటెక్‌ సిటీ, మైక్రోసాఫ్ట్‌, ఐఎ్‌సబీ వంటి ఎన్నో సంస్థ లు ఏర్పాటై నేడు లక్షలాది మంది యువతకు ఉపా ధి చూపుతున్నాయని, ప్రభుత్వ కొనసాగింపు ఆవశ్యకతను ప్రజలు గుర్తించాలని కోరారు. ‘ప్రభుత్వ పాలసీలను ప్రజల్లోకి తీసుకెళ్లడమేకాక, ‘మన మిత్ర’ వాట్సాప్‌ గవర్నెన్స్‌ను విజయవంతంగా అమలు చేస్తున్నాం. దీని ద్వారా 36 శాఖలకు చెందిన వెయ్యి రకాల సేవలను వాట్సాప్‌ ద్వారా అందిస్తున్నాం. వాట్సాప్‌ గవర్ననెన్స్‌ జాతీయస్థాయిలో ఫ్లాట్‌ఫాం ఏర్పాటు చేయడానికి మార్గం సుగమం చేస్తుంది’ అని పేర్కొన్నారు. ఆర్సెలార్‌ మిట్టల్‌ స్టీల్‌ ప్లాంట్‌ పనులకు ఫిబ్రవరిలో శ్రీకారం చుడతామన్నారు. లోకేశ్‌ ఇంకా ఏమన్నారంటే.


నైపుణ్యం పోర్టల్‌ ద్వారా..

మార్చిలో ఇండియా ఏఐ కాన్ఫరెన్సుకు ఏపీ ఆతి థ్యం ఇస్తోంది. నైపుణ్యం పోర్టల్‌ ద్వారా మాక్‌ ఇంటర్వ్యూలు సైతం నిర్వహిస్తాం. భారత్‌లో ల్యాండ్‌ రికార్డుల నిర్వహణ అతిపెద్ద సవాల్‌. దీనికి ఏపీ కూడా మినహాయింపు కాదు. ఇప్పుడు మేం ఏఐ వినియో గం ద్వారా ల్యాండ్‌ రికార్డులన్నీ బ్లాక్‌ చైన్‌ మీదకు తీసుకొస్తున్నాం. గూగుల్‌, ఆర్సెలార్‌ మిట్టల్‌, టీసీఎస్‌, కాగ్నిజెంట్‌ వంటి బడా కంపెనీలు రాష్ట్రానికి క్యూ కట్టడానికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి. మొదటిది నిరూపితమైన నాయకత్వం. సీఎం చంద్రబాబుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. రెండోది.. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌. మూడోది.. డబుల్‌ ఇంజన్‌ బుల్లెట్‌ ట్రైన్‌ సర్కారు. ప్రస్తుతం ఏపీలో నమో(నాయుడు, మోదీ) నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం జెట్‌ స్పీడ్‌తో పనిచేస్తోంది. పైమూడు కారణాలతో ఏపీ పెద్దఎత్తున పెట్టుబడులను ఆకర్షిస్తోంది.

Updated Date - Jan 10 , 2026 | 04:39 AM