Share News

నేడు పాఠశాలలు పునఃప్రారంభం

ABN , Publish Date - Jun 12 , 2026 | 04:09 AM

వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభమవుతోంది.

నేడు పాఠశాలలు పునఃప్రారంభం

  • బడులకు చేరిన పాఠ్యపుస్తకాలు

అమరావతి, జూన్‌ 11(ఆంధ్రజ్యోతి): వేసవి సెలవుల అనంతరం శుక్రవారం నుంచి పాఠశాలలు పునఃప్రారంభం అవుతున్నాయి. 2026-27 విద్యా సంవత్సరం నేటి నుంచి ప్రారంభమవుతోంది. బడుల పునఃప్రారంభానికి పాఠశాల విద్యాశాఖ ఇప్పటికే కార్యక్రమాలు చేపట్టింది. ప్రభుత్వ పాఠశాలల్లో చేరాలంటూ అడ్మిషన్ల కోసం ప్రత్యేక డ్రైవ్‌ కూడా చేపట్టింది. నేటి నుంచే విద్యార్థులకు పాఠ్యపుస్తకాల పంపిణీని ప్రారంభించనున్నారు. ఇప్పటికే 99శాతం పాఠ్యపుస్తకాలు పాఠశాలలకు చేరాయి. మైనారిటీ మీడియం పుస్తకాలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. యుద్ధం నేపథ్యంలో విద్యార్థులకు ఇచ్చే కిట్లలోని ఇతర వస్తువుల పంపిణీలో కొంత ఆలస్యం కానుంది. ఈ విద్యా సంవత్సరం నుంచి 1 నుంచి 5 తరగతుల విద్యార్థులకు కూడా విలువల విద్యను బోధించనున్నారు. అలాగే 6 నుంచి 9 తరగతి వరకు సిలబ్‌సలో పలు మార్పులు చేశారు.

Updated Date - Jun 12 , 2026 | 04:09 AM