‘కాన్వా’తో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం
ABN , Publish Date - Jun 19 , 2026 | 05:09 AM
డిజిటల్ విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు కాన్వా అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది.
అమరావతి, జూన్ 18(ఆంధ్రజ్యోతి): డిజిటల్ విద్యా విధానాన్ని బలోపేతం చేసేందుకు కాన్వా అనే సంస్థతో పాఠశాల విద్యాశాఖ ఒప్పందం చేసుకుంది. పాఠశాల విద్య డైరెక్టర్ తమీమ్ అన్సారియా, సమగ్రశిక్ష ఎస్పీడీ బి.శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గురువారం మంగళగిరిలోని విద్యాభవన్‌లో ఈ ఒప్పందం జరిగింది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లోకి కాన్వా ఫర్ ఎడ్యుకేషన్ అనే ప్లాట్‌ఫామ్ ఉచితంగా రానుంది. లీప్ యాప్‌తో కాన్వాను అనుసంధానం చేస్తారు.