ఒకటో తరగతి అడ్మిషన్లపై స్పష్టతనివ్వాలి
ABN , Publish Date - May 13 , 2026 | 05:15 AM
ఒకటో తరగతి అడ్మిషన్లకు వయసు కటాఫ్ తేదీపై స్పష్టతనివ్వాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ అధికారులను కోరారు.
అమరావతి, మే 12(ఆంధ్రజ్యోతి): ఒకటో తరగతి అడ్మిషన్లకు వయసు కటాఫ్ తేదీపై స్పష్టతనివ్వాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్ అధికారులను కోరారు. గతేడాది ఆగస్టు 31 కటాఫ్ తేదీగా తీసుకోగా, కొన్ని జిల్లాల్లో నవంబరు ప్రామాణికంగా అడ్మిషన్లు చేశారని తెలిపారు. ఆగస్టు 31 ప్రామాణికంగా తీసుకోవడం వల్ల ఒకట్రెండు నెలలు తక్కువ వయసున్న పిల్లలు ప్రభుత్వ పాఠశాలల్లో చేరలేకపోతున్నారని, వారు ప్రైవేటు బడులకు వెళ్తున్నారని, అలాంటివారు తిరిగి ప్రభుత్వ బడులకు రావడం లేదని పేర్కొన్నారు.
ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డుకు సభ్యుల నియామకం
రాష్ట్ర ట్రాన్స్‌జెండర్ సంక్షేమ బోర్డుకు ఐదుగురు సభ్యులను ప్రభుత్వం నియమించింది. విశాఖపట్నం జిల్లా కలెక్టర్‌ను ఆంధ్ర రీజియన్‌కు, తిరుపతి జిల్లా కలెక్టర్‌ను రాయలసీమ రీజియన్‌కు నియమించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన కోట ప్రేమ్‌సాగర్ రాయ్, గుంటూరు జిల్లాకు చెందిన నక్క జీవన్‌కుమారి, ప్రకాశం జిల్లాకు చెందిన బోను దుర్గను ట్రాన్స్‌జెండర్స్ ప్రతినిధులుగా బోర్డులో నియమించారు.