Share News

దేశానికే రోల్‌ మోడల్‌గా సంజీవని: గల్లా మాధవి

ABN , Publish Date - Jun 27 , 2026 | 05:26 AM

‘ప్రతి కుటుంబానికీ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా సంజీవని పథకాన్ని తీసుకొచ్చింది.

దేశానికే రోల్‌ మోడల్‌గా సంజీవని: గల్లా మాధవి

అమరావతి, జూన్‌ 26(ఆంధ్రజ్యోతి): ‘ప్రతి కుటుంబానికీ ఆరోగ్య రక్షణే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. అందులో భాగంగా సంజీవని పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచింది’ అని గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ‘సంజీవని ప్రాజెక్టులో ఇంటి వద్దకే 104 మొబైల్‌ మెడికల్‌ ల్యాబ్‌ వాహనాలు వస్తాయి. ప్రతి ఒక్కరికీ 42 నుంచి 75 రకాలు ఉచిత ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తారు. ఇప్పటికే సుమారు 19 లక్షల మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో దీనిని అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం సంకల్పించింది’ అని వివరించారు.

Updated Date - Jun 27 , 2026 | 05:26 AM