జల వనరుల శాఖలో స్టీల్ ధరలు సవరణ
ABN , Publish Date - May 23 , 2026 | 05:35 AM
స్టీల్ కొనుగోలు ధరలను సవరిస్తూ ‘స్టాండర్డ్ ఆఫ్ రేట్స్’ను జలవనరుల శాఖ ఖరారు చేసింది. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ సిఫారసుల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో..
స్టాండర్డ్ ఆఫ్ రేట్స్‌ను ఖరారు చేసిన ప్రభుత్వం
అమరావతి, మే 22 (ఆంధ్రజ్యోతి): స్టీల్ కొనుగోలు ధరలను సవరిస్తూ ‘స్టాండర్డ్ ఆఫ్ రేట్స్’ను జలవనరుల శాఖ ఖరారు చేసింది. బోర్డ్ ఆఫ్ చీఫ్ ఇంజనీర్స్ సిఫారసుల మేరకు ఈ ఏడాది ఫిబ్రవరిలో ధరల సవరణ నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సాయిప్రసాద్ తాజాగా ఉత్తర్వు జారీ చేశారు. దీనిప్రకారం.. 6 ఎం.ఎం ఎంఎస్ రాడ్స్ మెట్రిక్ టన్ను ధర రూ.55,000, ఎంఎస్ ఫ్లాట్స్ మెట్రిక్ టన్ను రూ. 54,000, మైల్డ్ స్టీల్ స్ట్రక్చరల్ యాంగిల్స్, చానల్స్ అండ్ ఐ-సెక్షన్స్ మెట్రిక్ టన్ను రూ.54,000, టీఎంటీ, హెచ్‌వైఎ్‌సడీ (ఐఎస్ఐ) బార్స్ టన్ను రూ.53,000. ఎఫ్‌ఈ-500, ఎఫ్‌ఈ-500డీ, ఎఫ్‌ఈ 500డి టన్నుకు రూ.53000, ఎంఎస్ ప్టేట్స్ టన్ను రూ.60,000, హెచ్‌ఎస్‌సీఆర్ స్టీల్ బార్స్ టన్ను రూ.57,000, పీసీ డ్రాన్‌వైర్ టన్ను రూ60,000, పీసీడ్రాన్ స్టీల్‌వైర్ టన్ను రూ.60,000, హెచ్‌ఆర్ స్టీల్ కాయిల్స్ 1.6 ఎం.ఎం రూ.51,000, హెచ్‌ఆర్ స్టీల్ ఇన్ కాయిల్స్ 2.0ఎం.ఎం రూ.49,000, ఎంఎస్ వైర్‌రాడ్ కాయిల్ (5.5/6.0 ఎంఎం)టన్ను రూ.48,000, ఫౌండ్రీ గ్రేడ్ పిగ్ ఐరన్ (2.00 నుంచి 2.24 ఎంఎం) టన్ను రూ.47,000గా నిర్ణయించారు.