గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్ల సీనియారిటీ జాబితా సవరణ
ABN , Publish Date - Apr 30 , 2026 | 03:33 AM
రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్ అధికారుల సీనియారిటీ జాబితాను సవరించింది. 2018-19 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి ...
అమరావతి, ఏప్రిల్ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం గ్రేడ్-1 మున్సిపల్ కమిషనర్ అధికారుల సీనియారిటీ జాబితాను సవరించింది. 2018-19 ప్యానల్ సంవత్సరానికి సంబంధించి పునర్వ్యవస్థీకరించిన జాబితా ఆధారంగా ఈ నిర్ణయం తీసుకుంది. ఇంతకు ముందు జారీచేసిన ఉత్తర్వుల్లో భాగంగా కనకమహాలక్ష్మి, ఎస్.వెంకటరమణ, కేటీ సుధాకర్, జి. రమణారెడ్డిలకు నోషనల్ ప్రమోషన్లు వారి జూనియర్లు/సీనియర్ల జాయినింగ్ తేదీలను పరిగణనలోకి తీసుకుని ఈ ప్రమోషన్లు ఇచ్చారు. అయితే ఇవి కోర్టు కేసుల తుది తీర్పులకు లోబడి ఉంటాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.