Share News

రాష్ట్రం మొత్తం 2 మల్టీజోన్లు

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:51 AM

రాష్ట్రం మొత్తం 2 మల్టీజోన్‌లుగా మారింది. ఇప్పటి వరకు ఆరు జోన్లుగా ఉన్న రాష్ట్రాన్ని 2 మల్టీజోన్లుగా వర్గీకరిస్తూ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

రాష్ట్రం మొత్తం 2 మల్టీజోన్లు

  • 6 జోన్లు రెండుగా వర్గీకరణ.. 95శాతం ఉద్యోగాలు స్థానికులకే

  • ఓపెన్‌ కేటగిరీలో 5 శాతమే.. రాష్ట్రస్థాయిలో అన్ని ఉద్యోగాలు

  • మల్టీజోనల్‌ పోస్టులుగా మార్పు.. స్థానికులకు అవకాశాలు మెరుగు

  • గెజిట్‌లోకి ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌.. నియామకాలు, జోన్లపై విధివిధానాలు

అమరావతి, ఏప్రిల్‌ 20(ఆంధ్రజ్యోతి): రాష్ట్రం మొత్తం 2 మల్టీజోన్‌లుగా మారింది. ఇప్పటి వరకు ఆరు జోన్లుగా ఉన్న రాష్ట్రాన్ని 2 మల్టీజోన్లుగా వర్గీకరిస్తూ.. ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా ఉద్యోగ నియామకాల్లో స్థానికులకు 95 శాతం.. ఓపెన్‌ కేటగిరీకి 5 శాతంగా నిర్ణయించింది. ఇక, రాష్ట్రస్థాయి పోస్టులను మల్టీజోనల్‌ పోస్టులుగా మార్పు చేసింది. ఈ మేరకు గత ఏడాది డిసెంబరు 15న ఇచ్చిన రాష్ట్రపతి ఉత్తర్వుల(ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌)ను అనుసరించి.. కేంద్ర హోం శాఖ అదే రోజు జారీ చేసిన ‘ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ ఎంప్లాయ్‌మెంట్‌-2025’ నోటిఫికేషన్‌ను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం గెజిట్‌లో పొందుపరిచింది. దీని ప్రకారం.. ప్రభుత్వ నియామకాల్లో స్థానికత, జోన్లకు సంబంధించిన విధివిధానాలను స్పష్టం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.


మార్పులు ఇవీ..

  • ఇప్పటి వరకు రాష్ట్ర కేడర్‌ పోస్టులుగా ఉన్న సీటీవో, డిప్యూటీ కలెక్టర్‌, డీఎస్పీ పోసు ్టలను మల్టీ జోనల్‌ పోస్టులుగా మార్చారు.

  • గతంలో సీటీవోలు, డిప్యూటీ కలెక్టర్లు, డీఎస్పీలు ఏ జిల్లాకైనా బదిలీపై వెళ్లేవారు. ఇ ప్పుడలా కుదరదు. ఒకవేళ స్పౌజ్‌ గ్రౌం డ్‌లో కోరుకుంటే సీనియారిటీ కోల్పోతారు.

  • గతంలో జిల్లా పోస్టులకు స్థానిక, ఓపెన్‌ కోటా నిష్పత్తి 85:15, జోనల్‌ పోస్టులకు 70:30, మల్టీజోనల్‌ పోస్టులకు 60:40గా ఉండేది. ఇప్పుడు ఆయా పోస్టులకు లోకల్‌, ఓపెన్‌ కోటాను 95:5గా చేశారు.

  • గతంలో 4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఎక్కడ చదివితే ఆ ప్రాంతంలో స్థానికులుగా నిర్ణయించేవారు. ఇప్పుడు 1-7 వరకు ఎక్కువ కాలం ఎక్కడ చదివి తే ఆ ప్రాంతానికే స్థానికులుగా ఉంటారు.

  • సచివాలయం, హెచ్‌వోడీ, ఇతర రాష్ట్రస్థాయి కార్యాలయాల నుంచి ఉద్యోగులు లోకల్‌, జోనల్‌, మల్టీజోనల్‌ కేడర్లలో డిప్యుటేషన్‌పై వెళ్లొచ్చు.

  • తెలంగాణ ప్రెసిడెన్షియల్‌ ఆర్డర్‌ తరహాలోనే ఏపీ ఆర్డర్‌లో కూడా రాష్ట్ర కేడర్‌ నుంచి లోకల్‌, జోన్‌ కేడర్‌కు బదిలీపై వెళ్లే వెసులుబాటు కల్పించారు.

  • విభజనపై అభ్యంతరాలు ఉన్న ఉద్యోగు లు 60 రోజుల్లోగా వినతిపత్రం ఇవ్వచ్చు. దీనిపై ప్రభుత్వం సంబంధిత వ్యవహారా లు చూసే కమిటీని సంప్రదించి నిర్ణయం తీసుకుంటుంది.

  • ఈ ఉత్తర్వు అమల్లోకి వచ్చిన తేదీ నుంచి 27 నెలల్లోగా రాష్ట్రంలోని సివిల్‌ సర్వీసెస్‌ పోస్టులను, రాష్ట్ర పరిధిలోని సివిల్‌ పోస్టులను.. ప్రభుత్వం వివిధ ప్రాంతాల కోసం వేర్వేరు స్థానిక కేడర్లుగా వర్గీకరించాలి.


  • ప్రతి జిల్లాలోని ప్రతి శాఖలో ఉన్న జూనియర్‌ అసిస్టెంట్‌ కేటగిరీకి చెందిన పోస్టులు, జూనియర్‌ అసిస్టెంట్‌తో సమానమైన, అంతకంటే తక్కువస్థాయి కలిగిన ఇతర కేటగిరీల పోస్టులను విడివిడి కేడర్లుగా వర్గీకరించాలి.

  • ప్రతిజోన్‌లో.. ప్రతి శాఖలో జూనియర్‌ అసిస్టెంట్‌పైన సూపరింటెండెంట్‌ కేటగిరీ వరకు ఉన్న పోస్టులు, అలాగే మొదటి స్థాయి గెజిట్‌, వాటితో సమానమైన ఇతర కేటగిరీల పోస్టులను ఒకే కేడర్‌గా వ్యవస్థీకరించాలి.

  • వీలైనంత వరకు ప్రతి స్థానిక ప్రాంతానికి సంబంధించిన పోస్టులో స్థానికుల కోసం కనీసం ఒక పోస్టును కేటాయించాలి.

  • రెండు లేదా అంతకంటే ఎక్కువ జిల్లాలు లేదా జోన్ల కోసం ఏదైనా కేటగిరీలకు సం బందించి ఒకే కేడర్‌ ఏర్పాటు చేయాల్సిన సందర్భాల్లో అలాంటి కేడర్‌లో ప్రత్యక్ష ని యామకం ద్వారా చేసే పోస్టుల్లో 95ు పోస్టులు స్థానికులకు రిజర్వు చేయాలి.


ఇవీ మల్టీజోన్లు

  • మల్టీజోన్‌-1: జోన్‌-1లోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్టణం, అనకాపల్లి, జోన్‌-2లోని అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కాకినా డ, అంబేడ్కర్‌ కోనసీమ, జోన్‌-3లోని పశ్చి మ గోదావరి, ఏలూరు, ఎన్టీఆర్‌, కృష్ణా జిల్లాలను మల్టీజోన్‌-1గా వర్గీకరించారు.

  • మల్టీజోన్‌-2: జోన్‌-4లోని గుంటూరు, ప ల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, జోన్‌ -5లోని తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, జోన్‌-6లోని నంద్యాల, అనంతపురం, కర్నూలు, శ్రీసత్యసాయి జిల్లాలను మల్టీజోన్‌-2గా వర్గీకరించారు.

Updated Date - Apr 21 , 2026 | 04:53 AM