Share News

రాష్ట్రంలో మరో 10 కొవిడ్‌ కేసులు

ABN , Publish Date - Jul 26 , 2026 | 04:30 AM

రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 49కి చేరింది. శనివారం ఒక్కరోజే 10 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా..

రాష్ట్రంలో మరో 10 కొవిడ్‌ కేసులు

  • 49కి చేరిన పాజిటివ్‌లు

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో కొవిడ్‌ కేసుల సంఖ్య 49కి చేరింది. శనివారం ఒక్కరోజే 10 మందికి కొవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 24 మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ఏలూరు జిల్లా పెదవేగి మండలం వేగివాడకు చెందిన యువకుడు(25) మూత్రపిండాల సమస్యతో ఈనెల 21న విజయవాడలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. ఆయనకు జ్వరం, దగ్గు, జలుబు తదితర లక్షణాలు కనిపించడంతో కొవిడ్‌ పరీక్ష నిర్వహించగా, పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం ఆరవిల్లికి చెందిన బాలింతకు కరోనా నిర్ధారణ అయ్యింది. రాజమండ్రిలోని ప్రైవేటు ఆస్పత్రిలో ఆమె నాలుగు రోజులు క్రితం ప్రసవం అయ్యింది. వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా నిర్ధారణ అయ్యింది.

Updated Date - Jul 26 , 2026 | 04:31 AM