Share News

రెండో విడత ఫీజులు విడుదల

ABN , Publish Date - Mar 21 , 2026 | 04:49 AM

ఉన్నత విద్య ఫీజు బకాయిలపై ఫిబ్రవరిలో రూ.1200 కోట్లకు ఇచ్చిన బీఆర్‌వోలలో రెండో విడత ఫీజులను ప్రభుత్వం ఉగాది రోజున విడుదల చేసింది.

రెండో విడత ఫీజులు విడుదల

అమరావతి, మార్చి 20 (ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య ఫీజు బకాయిలపై ఫిబ్రవరిలో రూ.1200 కోట్లకు ఇచ్చిన బీఆర్‌వోలలో రెండో విడత ఫీజులను ప్రభుత్వం ఉగాది రోజున విడుదల చేసింది. బీసీ-డి విద్యార్థుల ఫీజులు సుమారు రూ.300 కోట్లను కొద్దిరోజుల కిందట విడుదల చేసింది. తాజాగా ఉగాది రోజున ఎస్సీ విద్యార్థులు, బీసీ-బి విద్యార్థుల ఫీజులు సుమారు రూ.300 కోట్లు విడుదల చేసింది. మిగిలిన రూ.600 కోట్ల విడుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కాగా, ఉగాది రోజున ఫీజులు విడుదల చేసినందుకు ఏపీ ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీల సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోయ సుబ్బారావు, గ్రంథి సత్యనారాయణ సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. మిగిలిన బకాయిలు కూడా వీలైనంత త్వరగా జమ చేయాలని విజ్ఞప్తి చేశారు.

Updated Date - Mar 21 , 2026 | 04:50 AM