Share News

మహిళా సంరక్షణ కార్యదర్శులకు మార్గదర్శకాలు

ABN , Publish Date - Jun 25 , 2026 | 03:17 AM

స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖకు డిప్యూటేషన్‌పై వచ్చిన 780 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు..

మహిళా సంరక్షణ కార్యదర్శులకు మార్గదర్శకాలు

అమరావతి, జూన్‌ 24(ఆంధ్రజ్యోతి): స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు శాఖ నుంచి మహిళా, శిశు సంక్షేమ శాఖకు డిప్యూటేషన్‌పై వచ్చిన 780 మంది మహిళా సంరక్షణ కార్యదర్శులు(మహిళా పోలీసులు) నిర్వహించాల్సిన విధులపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లోనే వినియోగించాలని ఆదేశించింది. మహి ళా, శిశు సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి సూర్యకుమారి ఈ మేరకు మార్గదర్శకాలు జారీచేశారు. మహిళా పోలీసు సిబ్బంది సేవలను కిషోర వికాసం, మహిళా సాధికారత, మహిళలు, బాలల సంరక్షణ, బాలల హక్కుల పరిరక్షణ, మిషన్‌ వాత్సల్య, జువెనైల్‌ జస్టిస్‌, బాల్య వివాహాల నిరోధం, బాల కార్మికుల గుర్తింపు, మానవ అక్రమ రవాణా నిరోధం, వన్‌స్టా్‌ప సెంటర్లు, జిల్లా బాలల రక్షణ విభాగాలు (డీసీపీయూ), చైల్డ్‌ హెల్ప్‌లైన్‌, పోక్సో కేసులకు సహాయక సేవలు తదితర కార్యక్రమాల్లో మాత్రమే వినియోగించుకోవాలని స్పష్టం చేశారు. వారిని ఐసీడీఎస్‌ పోషకాహార కార్యక్రమాల అమలు, అంగన్వాడీ కేంద్రాల రోజువారీ నిర్వహణ, స్టాక్‌ రిజిస్టర్ల నిర్వహణ వంటి పనులకు ఉపయోగించరాదని స్పష్టం చేశారు. మహిళ-శిశు రక్షణకు సంబంధంలేని పరిపాలనా పనులు కూడా అప్పగించరాదని పేర్కొన్నారు.

Updated Date - Jun 25 , 2026 | 03:17 AM