Share News

కాలువల్లో పూడికతీత పనులకు రూ.397 కోట్లు

ABN , Publish Date - May 03 , 2026 | 05:20 AM

సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.397 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తక్షణమే తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు...

కాలువల్లో పూడికతీత పనులకు రూ.397 కోట్లు

  • తక్షణమే తూడు, గుర్రపుడెక్క తొలగించండి: నిమ్మల

అమరావతి, మే 2(ఆంధ్రజ్యోతి): సాగునీటి కాలువల్లో పూడికతీత పనులు చేపట్టేందుకు ప్రభుత్వం రూ.397 కోట్లు విడుదల చేసింది. ఈ నిధులతో తక్షణమే తూడు, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేపట్టాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఆదేశించారు. నెలాఖరులోగా పనులన్నీ పూర్తిచేసి, ఖరీ్‌ఫలో కాలువల ద్వారా నీటి ప్రవాహానికి ఇబ్బందిలేకుండా చూడాలన్నారు. శనివారం వియజవాడలో మంత్రి విలేకరులతో మాట్లాడుతూ పనులు వెంటనే మొదలు పెట్టేలా అధికారులంతా కార్యాచరణను సిద్ధం చేయాలన్నారు. పది లక్షల రూపాయలలోపు పనులను నామినేషన్‌ విధానంపై సాగు నీటి సంఘాల ద్వారా చేపట్టాలన్నారు.

Updated Date - May 03 , 2026 | 05:21 AM