Share News

కరెంటు వాడకంలో రికార్డు

ABN , Publish Date - Jul 16 , 2026 | 04:26 AM

వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా ఉన్న వాతావరణంతో విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈనెల 14న (మంగళవారం) 285.65 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగించారు.

కరెంటు వాడకంలో రికార్డు

  • ఈనెల 14న 285.65 మి.యూనిట్ల వినియోగం

  • వర్షాకాలంలోనూ ఎండలతో పెరిగిన డిమాండ్‌

అమరావతి, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వర్షాకాలంలోనూ వేసవిని తలపించేలా ఉన్న వాతావరణంతో విద్యుత్తు డిమాండ్‌ భారీగా పెరిగింది. ఈనెల 14న (మంగళవారం) 285.65 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వినియోగించారు. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఈ స్థాయిలో కరెంట్‌ వినియోగం జరగడం ఇదే మొదటిసారి అని విద్యుత్తుశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది ఏప్రిల్‌, మేల్లో గరిష్ఠ విద్యుత్తు వినియోగం 256 మిలియన్‌ యూనిట్లు. కాగా, ఈ ఏడాది మార్చి 7నే 274.6 మిలియన్‌ యూనిట్లు విద్యుత్తు వినియోగం నమోదైంది. ఆ తర్వాత కూడా సగటు వినియోగం 270 మిలియన్‌ యూనిట్లుగా నమోదవుతూ వచ్చింది. అత్యధిక డిమాండ్‌ ఉన్నా కూడా నిరంతరాయంగా నాణ్యమైన విద్యుత్తు సరఫరా చేస్తున్నామని మంత్రి గొట్టిపాటి రవికుమార్‌ తెలిపారు.

Updated Date - Jul 16 , 2026 | 04:27 AM