Share News

మేలో రూ.119 కోట్లు ఆస్తిపన్ను వసూలు

ABN , Publish Date - Jun 01 , 2026 | 04:58 AM

గ్రామ పంచాయతీల ఆస్తి పన్నుకు సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించిన రిబేట్‌ సత్ఫలితాలనిస్తోంది.

మేలో రూ.119 కోట్లు ఆస్తిపన్ను వసూలు

అమరావతి, మే 31(ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీల ఆస్తి పన్నుకు సంబంధించి పంచాయతీరాజ్‌ శాఖ ప్రకటించిన రిబేట్‌ సత్ఫలితాలనిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఆస్తి పన్నులను మే నెలలోపు చెల్లిస్తే ఐదు శాతం రిబేట్‌ ఇస్తామని ఈ శాఖ ప్రకటించింది. దీనివల్ల మే 31 నాటికి 119.78 కోట్ల ఆస్తి పన్ను వసూలైంది. పంచాయతీరాజ్‌ శాఖ చరిత్రలో మే నెలలో 100 కోట్లకు పైబడి ఆస్తి పన్ను వసూలు కావడం ఇదే తొలిసారి.

Updated Date - Jun 01 , 2026 | 05:00 AM