Share News

సైన్స్‌ సిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పునర్వ్యవస్థీకరణ

ABN , Publish Date - Jun 13 , 2026 | 05:13 AM

రాష్ట్ర సైన్స్‌ సిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చైర్మన్‌గా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన..

సైన్స్‌ సిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పునర్వ్యవస్థీకరణ

అమరావతి, జూన్‌ 12(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర సైన్స్‌ సిటీ ఎగ్జిక్యూటివ్‌ కమిటీని పునర్వ్యవస్థీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. చైర్మన్‌గా రాష్ట్ర మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉంటారు. సైం టిస్టు కె.జగన్నాథరావు, కౌన్సిల్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ వేణుగోపాల్‌ ఆచంట, అనంత్‌ టెక్నాలజీస్‌ ఫౌండర్‌, సీఎండీ దావులూరి సుబ్బారావు, రాష్ట్ర క్వాంటం మిషన్‌ డైరెక్టర్‌ సీవీ శ్రీధర్‌, సైన్స్‌ సిటీ సీఈవో సభ్యులు.

Updated Date - Jun 13 , 2026 | 05:14 AM