Share News

వాయుగుండం వచ్చినా.. భారీ వర్షాల్లేవు

ABN , Publish Date - Jul 28 , 2026 | 05:32 AM

తీవ్ర వాయుగుండం వచ్చినా.. రాష్ట్రంలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది.

వాయుగుండం వచ్చినా..  భారీ వర్షాల్లేవు

  • చెదురుమదురు చినుకులతో సరి

  • దిశగా మార్చుకుని బెంగాల్‌ వైపు వాయుగుండం

  • రాష్ట్రంలో 54 శాతం లోటు వర్షపాతం

విశాఖపట్నం, జూలై 27(ఆంధ్రజ్యోతి): తీవ్ర వాయుగుండం వచ్చినా.. రాష్ట్రంలో ఆశించిన వర్షాలు కురవలేదు. ఉత్తర కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే విచిత్రంగా బంగాళాఖాతంలో పశ్చిమ వాయవ్యంగా పయనించాల్సిన.. తీవ్ర వాయుగుండం దిశ మార్చుకుని ఉత్తరంగా పయనించడంతో సోమవారం కోస్తాలో చెదురుమదురు వర్షాలే పడ్డాయి. ఈ సీజన్‌లో సోమవారం వరకు రాష్ట్రంలో వర్షపాతం లోటు 54 శాతానికి చేరుకోవడంతో కరువు ఛాయలు కనిపిస్తున్నాయని వ్యవసాయ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. కాగా ఎల్‌నినో సంవత్సరాల్లో నైరుతి రుతుపవనాలు బలహీనంగా మారతాయని, అరేబియా సముద్రం నుంచి వీచే గాలులు బలంగా ఉండవని, పశ్చిమ కనుమల వరకు పరిమితమై ఆ తరువాత పొడిగా మారతాయని విశ్లేషించారు. ప్రస్తుత సీజన్‌లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు రెయిన్‌షాడో ప్రాంతాలుగా మారతాయన్నారు. రాష్ట్రంలో చాలాచోట్ల మేఘాలున్నా అవి బలంగా లేకపోవడంతో వర్షాలు కురవడం లేదన్నారు.

Updated Date - Jul 28 , 2026 | 05:33 AM