Share News

గన్‌ పేరుందని మావిగన్‌ అంటావా!: రామకృష్ణ

ABN , Publish Date - Apr 14 , 2026 | 06:12 AM

‘గన్‌ ఉందని... రాజధాని మావిగన్‌ అంటావా జగన్‌..! ఎన్నిసార్లు మాటలు మారుస్తావ్‌?’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు.

గన్‌ పేరుందని మావిగన్‌ అంటావా!: రామకృష్ణ

అనంతపురం విద్య, ఏప్రిల్‌13(ఆంధ్రజ్యోతి): ‘గన్‌ ఉందని... రాజధాని మావిగన్‌ అంటావా జగన్‌..! ఎన్నిసార్లు మాటలు మారుస్తావ్‌?’ అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ధ్వజమెత్తారు. అనంతపురంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘సాక్షాత్తు అసెంబ్లీలో తొలుత రాజధానిగా అమరావతి భేష్‌ అన్నాడు. ఇంకా కొన్ని వేల ఎకరాలు అవసరమని పేర్కొన్నాడు. అధికారంలోకి వచ్చాక అమరావతి ఒక్కటే సరికాదంటూ మూడు రాజధానులన్నాడు. ఇపుడు మళ్లీ మావిగన్‌ అంటున్నాడు. జగన్‌... ఎన్నిసార్లు మాటలు మారుస్తావు? అధికారంలోకి వచ్చాక మూడు రాజధానులు అన్నప్పుడే వైసీపీ పతనం మొదలైంది’ అని అన్నారు.

Updated Date - Apr 14 , 2026 | 06:13 AM