విద్యుత్తు ప్రసార ప్రాజెక్టుల్లో వేగం పెరగాలి
ABN , Publish Date - Jun 17 , 2026 | 05:08 AM
రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చడంతో పాటు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరాను అందించేందుకు చేపట్టిన..
డిసెంబరు కల్లా 24 ప్రాజెక్టులు పూర్తి కావాలి: విజయానంద్
అమరావతి, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో పెరుగుతున్న విద్యుత్ అవసరాలను సమర్థవంతంగా తీర్చడంతో పాటు నాణ్యమైన, నిరంతరాయ విద్యుత్తు సరఫరాను అందించేందుకు చేపట్టిన 400 కేవీ, 220 కేవీ, 132 కేవీ ప్రాజెక్టులను వేగవంతం చేయాలని సీఎం ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో రూ. 3,507 కోట్ల అంచనాతో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో చేపట్టిన 24 కీలక విద్యుత్తు ప్రసార ప్రాజెక్టులను ఈ ఏడాది డిసెంబరు నాటికి పూర్తి చేయాలన్నారు. మంగళవారం విద్యుత్తు సౌధలో ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ ప్రాజెక్టుల పురోగతిపై విజయానంద్ సమీక్షించారు.