Share News

పల్స్‌ పోలియో 91.95 శాతం

ABN , Publish Date - Jun 29 , 2026 | 05:59 AM

రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో 91.95 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేశారు.

పల్స్‌ పోలియో 91.95 శాతం

  • 45.24 లక్షల మంది చిన్నారులకు చుక్కల మందు

అమరావతి, జూన్‌ 28(ఆంధ్రజ్యోతి): రాష్ట్రవ్యాప్తంగా ఆదివారం జరిగిన పల్స్‌ పోలియో కార్యక్రమంలో 91.95 శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేశారు. రాష్ట్రంలోని 49.02 లక్షల మందికి పోలియో చుక్కలు వేయాల్సి ఉండగా 45.24 లక్షల మంది చిన్నారులకు వేశారు. పల్స్‌పోలియో కార్యక్రమానికి ఆరోగ్యశాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. అత్యధికంగా ఎన్టీఆర్‌లో 115.16, మార్కాపురంలో 113.21, కృష్ణాలో 104.29 శాతం మందికి చుక్కలు వేశారు. అతి తక్కువగా కర్నూలులో 73.58, అన్నమయ్యలో 79.90, నంద్యాలలో 80.91 శాతం మందికి చుక్కలు వేశారు. మిగిలిపోయినవారికి ఆరోగ్యశాఖ సిబ్బంది సోమ, మంగళవారాల్లో వారి ఇళ్ల వద్దకు వెళ్లి చుక్కలు వేస్తారని కమిషనర్‌ చక్రధర్‌బాబు తెలిపారు.

Updated Date - Jun 29 , 2026 | 06:00 AM