Share News

మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

ABN , Publish Date - Apr 25 , 2026 | 05:29 AM

రాష్ట్రంలో మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా బాపట్ల, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా...

మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నాం

  • మలేరియా రహిత జిల్లాలుగా బాపట్ల, పశ్చిమగోదావరి, కోనసీమ: మంత్రి సత్య

అమరావతి, ఏప్రిల్‌ 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మలేరియా నివారణకు చర్యలు తీసుకుంటున్నామని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ తెలిపారు. ఇందులో భాగంగా బాపట్ల, పశ్చిమగోదావరి, కోనసీమ జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు కేంద్రానికి ప్రతిపాదన లు పంపుతున్నామని మంత్రి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటి వరకు 899 కేసులు నమోదైనట్లు చెప్పారు. 2030 నాటికి మలేరియా కేసులను గణనీయంగా తగ్గించేందుకు చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఏప్రిల్‌ 25 ప్రపంచ మలేరియా దినం సందర్భంగా, రాబోయే వర్షాలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్రంలో ఇండోర్‌ రెసిడ్యువల్‌ స్ర్పే చేస్తున్నామన్నారు. బాపట్ల, కోనసీమ, పశ్చిమగోదావరి జిల్లాలను మలేరియా రహిత జిల్లాలుగా ప్రకటించేందుకు ప్రతిపాదనలను కేం ద్రానికి పంపనున్నట్లు తెలిపారు. ప్రపంచ మలేరియా దినోత్సవం సందర్భంగా ప్రచార, అవగాహన వాల్‌పోస్టర్లు, కరపత్రాల్ని ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ జి.వీరపాండియన్‌ శుక్రవారం ఆవిష్కరించారు.

Updated Date - Apr 25 , 2026 | 05:30 AM