Share News

రాష్ట్రంలో ‘పరిశోధన ఆవిష్కరణల’ అభివృద్ధి

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:30 AM

జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న శాస్త్ర, సాంకేతిక, పరిశోధన ఆవిష్కరణల(ఎస్‌టీఐ) పాలసీని రాష్ట్రంలోనూ అభివృద్ధి చేయాలని రాష్ట్ర సైన్స్‌ సిటీ-మౌలిక సదుపాయాల కల్పనా శాఖలు నిర్ణయించాయి

రాష్ట్రంలో ‘పరిశోధన ఆవిష్కరణల’ అభివృద్ధి

  • శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విద్యార్థుల ఆలోచనలకు ప్రోత్సాహం

  • సైన్స్‌ సిటీ-మౌలిక సదుపాయాల కల్పనా శాఖల మధ్య ఎంవోయూ

అమరావతి, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): జాతీయ స్థాయిలో అమలు చేస్తున్న శాస్త్ర, సాంకేతిక, పరిశోధన ఆవిష్కరణల(ఎస్‌టీఐ) పాలసీని రాష్ట్రంలోనూ అభివృద్ధి చేయాలని రాష్ట్ర సైన్స్‌ సిటీ-మౌలిక సదుపాయాల కల్పనా శాఖలు నిర్ణయించాయి. విద్యార్థుల్లో సృజనాత్మకతను పెంపొందిస్తూ.. శాస్త్ర, సాంకేతిక పరిశోధనల్లో ప్రోత్సాహాన్ని ఇచ్చేందుకుగాను ఈ శాఖల మధ్య సోమవారం అవగాహన ఒప్పందం కుదిరింది. మౌలిక సదుపాయాల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎం.టి.కృష్ణబాబు, సైన్స్‌ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు, కౌన్సిల్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ ఇండస్ట్రియల్‌ రిసెర్చ్‌ (సీఎస్ఐర్‌) అధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరిగింది. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ కమ్యూనికేషన్‌ అండ్‌ పాలసీ రిసెర్చ్‌, న్యూఢిల్లీ ఆధ్వర్యంలో విద్యార్థుల్లో సృజనాత్మకత పెంపొందించేలా పలు విజ్ఞాన కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించాయి. ఈ ఎంవోయూ ద్వారా సైన్స్‌, టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ రంగాల్లో సమష్టి పరిశోధనాతత్వం పెరుగుతుందని కృష్ణబాబు పేర్కొన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 05:34 AM