Share News

ఐదుగురు ఐపీఎస్‌లకు పదోన్నతి

ABN , Publish Date - Apr 30 , 2026 | 03:59 AM

రాష్ట్రంలో 2021, 2022 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం సీనియర్‌ టైమ్‌ స్కేల్‌ హోదా కల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ బుధవారం..

ఐదుగురు ఐపీఎస్‌లకు పదోన్నతి

  • సీనియర్‌ టైమ్‌ స్కేల్‌ హోదా కల్పించిన ప్రభుత్వం

అమరావతి, ఏప్రిల్‌ 29(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో 2021, 2022 బ్యాచ్‌కు చెందిన ఐదుగురు ఐపీఎస్‌ అధికారులకు ప్రభుత్వం సీనియర్‌ టైమ్‌ స్కేల్‌ హోదా కల్పించింది. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జి.సాయిప్రసాద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆ హోదా పొందిన వారిలో నవజ్యోతి మిశ్రా, పాటిల్‌ దేవరాజ్‌ మనీష్‌, మండ జావళి అల్ఫోన్స్‌, మనోజ్‌ రమానాథ్‌ హెగ్దే, రోహిత్‌కుమార్‌ చౌదరి ఉన్నారు. ఈ ఐపీఎస్‌ అధికారులందరినీ ఇన్‌-సిటుగా నియమిస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదోన్నతి పొందినవీరంతా ఏడాది వ్యవధిలో శాఖాపరమైన పరీక్షల్లో ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.

Updated Date - Apr 30 , 2026 | 03:59 AM