Share News

మరో 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతి

ABN , Publish Date - Jun 26 , 2026 | 05:41 AM

పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖలో పదోన్నతుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ శాఖలో 10 వేల మందికి పదోన్నతులు..

మరో 42 మంది ఎంపీడీవోలకు పదోన్నతి

  • డీడీఓలుగా నియమించేందుకు డీపీసీ ఆమోదం

అమరావతి, జూన్‌ 25 (ఆంధ్రజ్యోతి): పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధిశాఖలో పదోన్నతుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఈ శాఖలో 10 వేల మందికి పదోన్నతులు కల్పించిన ఉపముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌ దీన్ని నిరంతర ప్రక్రియగా మార్చారు. తాజాగా 42 మంది ఎంపీడీవోలకు డీడీఓలుగా పదోన్నతులు కల్పించేందుకు సీనియారిటీ జాబితాను డిపార్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) ఆమోదించింది.

Updated Date - Jun 26 , 2026 | 05:42 AM