Share News

బీసీల రక్షణే కూటమి లక్ష్యం

ABN , Publish Date - Mar 15 , 2026 | 05:17 AM

‘రాష్ట్రంలోని 138 వెనుకబడిన తరగతుల కులాల వారి ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నాం. త్వరలోనే అమల్లోకి తీసుకువస్తాం’ అని మంత్రి ఎస్‌.సవిత చెప్పారు.

బీసీల రక్షణే కూటమి లక్ష్యం

  • సిద్ధమైన ముసాయిదా చట్టం: మంత్రి సవిత

  • విజయవాడలో మంత్రుల భేటీ

  • అచ్చెన్న, కొల్లు, అనగాని, ఎమ్మెల్సీ రవిచంద్ర హాజరు

  • వర్చువల్‌గా హాజరైన సుభాష్‌, కొండపల్లి, సత్యకుమార్‌

అమరావతి, మార్చి 14(ఆంధ్రజ్యోతి): ‘రాష్ట్రంలోని 138 వెనుకబడిన తరగతుల కులాల వారి ధన, మాన, ప్రాణాలకు రక్షణ కల్పించేందుకు బీసీ రక్షణ చట్టం రూపొందిస్తున్నాం. త్వరలోనే అమల్లోకి తీసుకువస్తాం’ అని మంత్రి ఎస్‌.సవిత చెప్పారు. శనివారం విజయవాడలో ఆమె నేతృత్వంలో నిర్వహించిన బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై చర్చించేందుకు బీసీ మంత్రులు భేటీ అయ్యారు. అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ బీద రవిచంద్రలు ఈ సమావేశానికి హాజరుకాగా... వాసంశెట్టి సుభాష్‌, కొండపల్లి శ్రీనివాస్‌, సత్యకుమార్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. శనివారం విజయవాడలో మంత్రి సవిత నేతృత్వంలో నిర్వహించిన బీసీ రక్షణ చట్టం రూపకల్పనపై చర్చించేందుకు బీసీ మంత్రులు భేటీ అయ్యారు. కింజరాపు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్‌, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర యాదవ్‌లు ఈ సమావేశానికి హాజరుకాగా.. వాసంశెట్టి సుభాశ్‌, కొండపల్లి శ్రీనివాస్‌, సత్యకుమార్‌ యాదవ్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా వర్చువల్‌గా పాల్గొన్నారు. ఈ సమావేశం అనంతరం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంత్రి సవిత మాట్లాడారు. ‘బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీల అమలులో భాగంగానే త్వరలో బీసీ రక్షణ చట్టాన్ని అమల్లోకి తీసుకువస్తున్నాం. దేశంలోనే తొలిసారిగా ఏపీలో ఈ చట్టం అమలు చేయబోతున్నాం. ఈ చట్టం రూపకల్పనకు తుది రూపు ఇవ్వడానికే నేడు బీసీ మంత్రులతో కీలక సమావేశాన్ని నిర్వహించాం. ఇదివరకే రెండు పర్యాయాలు సమావేశమయ్యాం.


చట్టం ముసాయిదా కూడా సిద్ధం చేశాం. బీసీల ధన, మాన, ప్రాణాలకు భరోసా కల్పించేలా ఈ చట్టాన్ని రూపొందించాం. 15 రకాల వేధింపులకు శిక్షలు ఖరారు చేస్తున్నాం. ఈ సమావేశం వివరాలను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించాం. ముసాయిదా చట్టంపై బీసీ ఎమ్మెల్యేల అభిప్రాయాలతోపాటు రాష్ట్రవ్యాప్తంగా ఐదు జోన్లలో ఉన్న బీసీ సంఘాలు, ప్రతినిధుల అభిప్రాయాలు కూడా తీసుకోవాలని నిర్ణయించాం’ అని సవిత పేర్కొన్నారు. ఆ శాఖ కార్యదర్శి ఎస్‌.సత్యనారాయణ మాట్లాడుతూ, కేంద్ర అడ్వొకేట్‌ జనరల్‌, జాతీయ బీసీ కమిషన్‌ సలహాలు, సూచనలనూ పరిగణనలోకి తీసుకున్నట్లు చెప్పారు. లా జాయింట్‌ సెక్రటరీ వెంకటేశ్వరరావు వీడియో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు సూచనలు చేశారు. రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ డైరెక్టర్‌ మల్లికార్జున, ఇతర అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Mar 15 , 2026 | 05:18 AM