Share News

తుగ్లక్‌ ఆలోచనలకు పెట్టింది పేరు జగన్‌

ABN , Publish Date - May 23 , 2026 | 04:56 AM

‘ప్రపంచంలో ఏ తుగ్లక్‌కు రాని ఆలోచనలు జగన్‌కు వస్తుంటాయి. జగన్‌ చెప్పిన మావిగన్‌ విని మేం భయపడడంలేదు. ఆయన మాటలకు జనాలు భయపడుతున్నారు’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు.

తుగ్లక్‌ ఆలోచనలకు పెట్టింది పేరు జగన్‌

  • ఆయనది తల్లిని, చెల్లిని తరిమేసిన నీచ చరిత్ర

  • గత ఐదేళ్లు వైసీపీ రాక్షస పాలనకు జనం భయపడ్డారు

  • జగన్‌కు, చంద్రబాబుకు నక్కకు నాక లోకానికి ఉన్నంత తేడా: మంత్రి నిమ్మల

అమరావతి, మే 22(ఆంధ్రజ్యోతి): ‘ప్రపంచంలో ఏ తుగ్లక్‌కు రాని ఆలోచనలు జగన్‌కు వస్తుంటాయి. జగన్‌ చెప్పిన మావిగన్‌ విని మేం భయపడడంలేదు. ఆయన మాటలకు జనాలు భయపడుతున్నారు’ అని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. శుక్రవారం టీడీపీ కేంద్ర కార్యాలయం వద్ద, అమరావతి సచివాలయం గేటు బయట ఆయన మీడియాతో మాట్లాడారు. ‘గత ఐదేళ్లు జగన్‌ చేసిన రాక్షస పాలన చూసి జనాలు భయపడ్డారు. హత్య, ఫ్యాక్షన్‌ రాజకీయాలకు పేటెంట్‌ హక్కు జగన్‌కే ఉంది. సొంత బాబాయిని చంపిన చరిత్ర, తల్లి, చెల్లిని తరమెసిన నీచ చరిత్ర జగన్‌ది. జగన్‌ మాటలకు చేతలకు పొంతన ఉండదు. ఆయన అధికారంలో ఉంటే ఒకలా, లేకపోతే మరోలా మాట్లాడతారు. జగన్‌ 2014-19లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇదే రాజధాని అమరావతిని ఆహ్వానిస్తున్నానని చెప్పారన్నారు. అధికారంలోకి రాగానే మాట తప్పి, మడమ తిప్పేశాడు. అమరావతి కాదు, మూడు ముక్కలు అన్నాడు. రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ని 30 ఏళ్లు వెనక్కి నెట్టాడు. చంద్రబాబుకు, జగన్‌కు... నక్కకి నాక లోకానికీ ఉన్నంత తేడా ఉంది. పాతికేళ్ల యువకుడిలా చంద్రబాబు ఆలోచనలు, పనితీరు ఉంది. అదే జగన్మోహన్‌రెడ్డి హెలికాప్టర్‌ ఎక్కడానికి నిచ్చెన తెప్పించుకోవాల్సి వచ్చింది. కొబ్బరికాయ కొట్టాడానికి వంగలేని వ్యక్తి జగన్‌. 11 సీట్లకే పరిమితం చేసి తనను పక్కన కూర్చోబెట్టిన రాష్ట్ర ప్రజలపై జగన్‌ క్షక్ష సాధించాలనే తలంపుతో ఉన్నారు. అందువల్లనే తాము అధికారంలోకి వస్తే రక్తపాతం సృష్టిస్తామని భయపెడుతున్నారు. జగన్‌ పుట్టిన రోజు సందర్భంగా ఆ పార్టీ శ్రేణులు రక్తదానాలకు బదులు గొడ్డళ్లతో బైకులపై బలాదూర్‌ తిరుగుతూ నడి బజార్లో పొట్టేళ్లను నరికి జగన్‌ ఫొటోలకు రక్తాభిషేకం చేసిన భయానక చరిత్ర వారిది. జగన్‌ ఇలా బయటకు వచ్చి తన అంతరంగాన్ని బయటపెట్టుకోవడం మాకు మంచిది. మళ్లీ జగన్‌ అధికారంలోకి వస్తే భర్తలను కోల్పోయిన భార్యలు, బిడ్డలను కోల్పోయిన తల్లులు ఈ రాష్ట్రంలో ఉండాలనే ఒక వినాశనకరమైన బుద్ధి జగన్‌లో కనిపిస్తుంది’ అని మంత్రి నిమ్మల విమర్శించారు.

Updated Date - May 23 , 2026 | 04:57 AM