Share News

రాష్ట్ర పోలీస్‌ కమాండోల ప్రతిభ

ABN , Publish Date - May 17 , 2026 | 04:43 AM

రాష్ట్ర పోలీసు కమాండో బృందం జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకుంది. హరియాణాలోని మనేసర్‌ నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎ్‌సజీ) శిక్షణ కేంద్రంలో...

రాష్ట్ర పోలీస్‌ కమాండోల ప్రతిభ

  • జాతీయ క్రీడల్లో సత్తా.. డీజీపీ అభినందన

అమరావతి, మే 16(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పోలీసు కమాండో బృందం జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుకుంది. హరియాణాలోని మనేసర్‌ నేషనల్‌ సెక్యూరిటీ గార్డ్స్‌(ఎన్‌ఎ్‌సజీ) శిక్షణ కేంద్రంలో నిర్వహించిన 16వ అఖిల భారత పోలీస్‌ కమాండో పోటీల్లో నాలుగు ప్రతిష్టాత్మక ట్రోఫీలు కైవసం చేసుకుంది. 15 రాష్ట్రాలు, 9 కేంద్ర సాయుధ పోలీసు బలగాలు పాల్గొన్న ఈ పోటీల్లో ఏపీ కమాండోలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి అగ్రస్థానంలో నిలిచారు. బెస్ట్‌ స్టేట్‌ పోలీస్‌ కమాండో టీమ్‌ ట్రోఫీ, హార్డ్‌ లైనర్‌ ట్రోఫీ, బ్లాక్‌ హాక్‌ ట్రోఫీ, రణ్‌-నీతి ట్రోఫీ సాధించారు. వారిని డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తా అభినందించారు. గ్రేహౌండ్స్‌, ఆక్టోపస్‌ కమాండో విభాగాల క్రమశిక్షణ, ఉన్నత స్థాయి శిక్షణ, యుద్ధ సంసిద్ధతకు ఈ విజయం నిదర్శనమని పోలీస్‌ బాస్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో రాష్ట్రానికి కీర్తి తీసుకొచ్చిన కమాండోలకు డీజీపీ కమండేషన్‌ డిస్క్‌ అండ్‌ సర్టిఫికెట్స్‌-2026తోపాటు నగదు ప్రోత్సాహకాలు అందజేశారు.

Updated Date - May 17 , 2026 | 04:44 AM