ఏపీ సినీ రంగానికి టెక్ గ్లామర్
ABN , Publish Date - Jun 26 , 2026 | 04:41 AM
‘‘ఆంధ్రప్రదేశ్ యువతలో అద్భుతమైన సృజనాత్మకత ఉంది. వారికి సరైన వేదిక, ఆధునిక సాంకేతికత తోడైతే టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తారు’’ అని మంత్రి దుర్గేశ్ అభిప్రాయపడ్డారు.
మంత్రి దుర్గేశ్‌తో జాడెక్స్ ఇన్నోవిజన్ ప్రతినిధుల భేటీ
అమరావతి, జూన్ 25(ఆంధ్రజ్యోతి): ‘‘ఆంధ్రప్రదేశ్ యువతలో అద్భుతమైన సృజనాత్మకత ఉంది. వారికి సరైన వేదిక, ఆధునిక సాంకేతికత తోడైతే టాలీవుడ్‌లో సరికొత్త సంచలనాలు సృష్టిస్తారు’’ అని మంత్రి దుర్గేశ్ అభిప్రాయపడ్డారు. గురువారం సచివాలయంలో మంత్రిని జాడెక్స్ ఇన్నోవిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ దివ్య కొనకళ్ల, కో-ఫౌండర్ శశికుమార్ పెయ్యాల మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్రంలో క్రియేటివ్ ఎకానమీ, ఫిల్మ్ మేకింగ్‌పై వర్క్‌షాప్ నిర్వహించాలన్న తమ ఆలోచనను మంత్రికి వివరించారు. వారి ప్రతిపాదనకు మంత్రి దుర్గేశ్ సానుకూలంగా స్పందించారు. ఔత్సాహిక చిత్ర నిర్మాతలు, సాంకేతిక నిపుణులు ఏపీ యువతలోని సినిమా ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేసేలా, ఫిల్మ్ డెవల్‌పమెంట్‌కు అత్యంత ప్రాధాన్యతనిచ్చేలా జూలైలో క్రియేటివ్ ఎకానమీపై ఓ వర్క్‌షాపు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు మంత్రి కందుల దుర్గేశ్ పేర్కొన్నారు. ఈ వర్క్‌షాప్ ద్వారా స్థానిక టాలెంట్‌కు పెద్దపీట వేసి, ఏపీని సినిమా హబ్‌గా మారుస్తామని హామీ ఇచ్చారు.