రాష్ట్రంలో 10 వేల హోంస్టేలు
ABN , Publish Date - Jul 01 , 2026 | 05:27 AM
రాష్ట్రంలో హోంస్టేలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది.
ప్రోత్సాహానికి మార్గదర్శకాలు
5 వేల మంది నిరుద్యోగులకు ఉపాధి
అమరావతి, జూన్ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో హోంస్టేలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు సిద్ధం చేసింది. టూరిజం పాలసీ 2024-29లో భాగంగా ‘బెడ్ అండ్ బ్రేక్‌ఫాస్ట్’ విధానంలో దీనిని అభివృద్ధి చేసేందుకు సిద్ధమైంది. దీని అభివృద్ధికి తీసుకున్న చర్యలు, రిజిస్ట్రేషన్ విధానం, ప్రోత్సాహకాలు, ఇతర అంశాలతో కూడిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ మేరకు పర్యాటక శాఖ స్పెషల్ సీఎస్ అజయ్ జైన్ మంగళవారం ఉత్తర్వు జారీ చేశారు. ఐదేళ్లల్లో 10 వేల హోం స్టేలను ప్రోత్సహించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఐదు వేల ఉద్యోగాలు, 20 వేల కుటుంబాలకు నైపుణ్యాభివృద్ధిని కల్పించేలా ఈ మార్గదర్శకాలను రూపొందించింది.